పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ii


(సమస్య) అచ్చాయమ్మకవిత్వధోరణి మహాహ్లా దంబు గల్పింప దే.

శా||సచ్చారి త్రులు పండితప్రవరులు సనోన్యులౌ వార లున్
మెచ్చంజాలనిదైనఁగాని మదిలోమే లెం'త్రు నైజమ్ముగా
నిచ్చోసందియమేల శాస్త్రికవికెంతెంతో వినోదమ్ముగా
నచ్చాయమ్మకవిత్వధోరణి మహాహ్లాదంబు గల్పింప దే1

శా|| అచ్చా? తిక్కన సోమయాజికృత డివ్య శ్రీకకా వ్యాళికిన్? మెచ్చం! తిమ్మ సముద్దుపల్కులకు సమ్మగా జెప్ప దృష్టాంతమా యుచ్చ స్రైణక విత్వసంతతికి నానొప్పారు చున్నట్టి యా యచ్చాయమ్మ కవిత్వధోరణి మహాహ్లాదంబు గల్పింప దే.2</poem>

శా! సచ్చారిత్ర పరాంబికాచరణ కంజాతార్చ నాసక్తి రా జచ్చేతోంబుజ విద్వడీడ్య కవితాంచద్వంశసంజాత వి ద్వచ్చంద్రాయిత వాసు దేవకవిరాజ్ఞాయాద యైనట్టి యీ యచ్చాయమ్మ కవిత్వధోరణి మహాహ్లాదంబు గల్పింప దే. 3</poem> </poem> కొందఱు కవులు మమ్ముఁగూర్చి తనుయ భి ప్రాయమును బద్యరూపము గావ్రా సి సభాముఖమ్మున వినిపించియు, దానిని మాకడకంపకుంటచే నయ్య విమాత్ర మిందులో బొత్తిగాఁ జేర లేదు. మఱియు నీగ్రంథాంతమునఁ బల్లెటూళ్లలోని కవులు గొందు మాపు స్తకముల నపేక్షించి వ్రాసిన పద్యములను వచనములనుగూడఁ బ్రసక్తి కలుగుక తన స్థాలీ పులాక న్యాయముగాఁ గొందఱు రచించిన వానీలో సయితము కొన్ని కొన్ని మాత్రము గై కొని ముద్రింపించితిమి, ఆయుత్తరములవలన మాపుస్తకములయందు లోకులకు గల యాదరము వెల్లడియగును గానఁ బ్రకృతము పుస్తక విక్రేతలమగు మేమవిగూడ గైకొ నవలసివచ్చినది. . ఆందు కొన్ని భాగములు మాకవితా శక్తిం గూర్చియే గాక యనవసర మగు మాయందచందములం గూర్చికూడ గొంతవఱకు నుతించియున్నవి. అయ్యవి యా చకుల స్వభావముం దెలిసికొనుటకుఁగాని లేక యే దేని యొక గుణమున్న చోట సర్వసు గుణములుగూడ నుండునని లోకులను కొందురనుటకుఁ గాని సూచకములై యంతింబోక చదువరులలో మాయంద సూయగలిగిన కొందఱు మమ్మి మూలమున నించుక యాక్షే పించి సంతసించుటకుఁగూడఁ బ్రేరక ములగుఁగాక! ఏమైనను మేమే కారణము చేతనో మాపుస్తకముల నీ కాలపుఁ గొందఱులు కవులవలె నాయాయి సుప్రసిద్ధులో యప్రసిద్దులో యగు కవులకడకంపి వారి సదభిప్రాయ మునో దురభిప్రాయమునో కైకొను తలంపు