పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విశాఖపట్టణము

41


తే|| గీ|| పొట్టి దౌచుట్ట గాల్చునప్పు డొక కొంత కాకదగిలిన నుర సుర కాలి పాడు వాసన ఘటింపఁ జేయు నహ్వ? యటైన వాసీ మీసాలు లౌకికాగ్రేసరులకు4

(సమస్య) మీసము చుట్టుకొన్న దిసుమీ యిటు మోమటు త్రిప్పఁబోకుమా

ఉ॥ హాసము, మోమునఁ జెలఁగ సంగజు ప్రేరణచేఁ బ్రియుండు దన్ మోసము చేసి 'మోవి గొన ముద్దియ పెంగగసాగె నష్టు వా డాసఖితోడఁ బల్కు నిటు లక్కట! యల్ల రిమాను సత్తులో మీసము చుట్టుకొన్న దిసుమీ! యిటుమో మటు త్రిప్పఁబోకుమీ,5

(సమస్య) ఈక లసారస్యము నీక కాని తెలీయం గా రాదు బింబాధరీ.

మ|| కలగంటి? వివరింపు మికలచమత్కారంబు నీ నంచు న వ్వెలయన్ బల్కిన నారకాంతగని యోహె! యీకలా! యీకలా! లలనా! నాకిది చెప్ప శక్య మగునా? లక్షించి చూడంగ నీ కలసారస్యము నీక కాని తెలియం గా రాదుబింబాధరీ,6

(సమస్య) పంగుస్సుదూరం వ్రజతి క్షణేన.

శ్లో ॥ శ్రీరామచంద్రస్య దయామ వాప్య కష్టం కరిష్యా మ్యవధాన మద్య లోకే యదాఽరు హ్య హి ధూమయానం పంగు స్సుదూరం ప్రజతి క్షణేన,7

(సమస్య). యువతవసనమధ్యే డంతీన స్పంచరంతి.

శ్లో | కరికరణవ కించి ద్దృశ్య తే వశ్య తాం న స్స భవతి కిము మో వేత్యాకులం చాపిచిత్తం వద ఇగళితలజ్జం లజ్జయాఽలహి కింతే యువతివసనమ ధ్యే దంతిన స్సంచరంతి8

(సమస్య) తొడియందము చెప్పఁదరమే తోయజనేత్రా.

క || వడివడి పనియున్న ప్పుడు, పొడు మెక్కక మిగుల విసువు పుట్టించునునీ గోడవొకటి లేక యుండినఁ దొడియందము చెప్పఁదరమెతోయజనేత్రా.

శ్రీ శ్రీ శ్రీ