పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నెల్లూరు

27



(రిజస్ట్రాగుగా రిచ్చినయుంగరము పోవుట.)

(ఈపద్యము వెంకటగిరీ నుండి పంపఁబడ్డది.)

ఉ॥ నల్లని వ్రేల నుండఁ దగునా! యని యో వెలి బూ దేకవ్వకుం.
దల్లడమందియో మఱియెదన్ భయ మే మిఁక దాపరించెనో
వెళ్లిడినాఁటి ! ప్రొద్దుటను వీథినిఁ గాలువ కేగువేళఁ దా
మెల్లగజాఱె నుంగరము మీ కిది చెప్పఁగ లేక వ్రాసితి?2

సీసము — జెడ్డీ గారి విందును గూర్చి

,
ఏనాఁడు జెడ్జీ ల తో నేక పంక్తి గా భోజనములు సేయ బుధుల కబ్బె
నేనాఁడు జెడ్జీలతో నున్న తస్తలిఁ గూర్చుండఁ బండిత కోటి కబ్బె
నేనాఁడు జెడ్జీ లతో నేక తంబున మాటలాడగఁ గవిమణుల కబ్బె
నేనాఁడు జెడ్జీల చే సీయఁబడు పుష్పమాలికల్ కవి శిఖామణుల కబ్బె'

...................................................................................................................

సహితముగ నొక్క కాగితపు ముక్క మీదవ్రాసి మధ్యమధ్య నిచ్చుచుండ నవియన్ని యు వరుసగా మనస్సునన తుర్చికొని యవధానాంతమందుఁ దప్పకుండ, ప్రతిపదమును వినిపించుటయ నెడు వ్యస్తాక్షరియును జేయఁబడెను.

4. ఆ నేక మారులుగ వేఱు వేఱు సంఖ్య లుగ కనుజాటుగఁ గొట్టఁబడిన గం టల మొత్తము తప్పకుండ నెను బదియొక్కటియని చెప్పఁబడియె.

5. వ్యాకరణశాస్త్రములో నొక పండితునితో శాస్త్ర సమ్మతముగ, బండిత జ నాను మోదమ్ముగఁ బ్రసంగంబు చేయుఁబడెను,

5. రఘువంశమ్ములో నొక విద్యార్థికి నొక్కశ్లోకము క్రమముగా బాఠము చెప్పబడినది.

6. లోక విషయములు చమత్కారముగ సయుక్త కముగ మధ్యమధ్య సభా నురంజక మగ నడిగిన వారితోడ నెల్ల ముచ్చటిం పఁబడినవి.

7. చతురంగములో బాగుగ నాడఁగలము అని పేరు వడసిన యొక యిద్దరు గొప్పవారొక్క ప్రక్క నుండి యాడఁగ వారితో నాడి గొప్పగొప్ప మొహరాలను గూడ నోడించి యెత్తుల నడిగినని చ్చుచు నాడఁబడినది.'

8.ఈ యనధానము లన్నియు నేలోపము లేక సమాప్తి నొందిన పిదప సభనావరించి వచ్చిన విద్వజ్జనులలో బహ్మశ్రీ గాడేపల్లి వెంకట రామశాస్త్రు లవారును బ్రహ్మశ్రీ పు రుషిళ్ల ఆదినారాయణ శాస్తులవారును వేంకటగిరి నుండి వచ్చిన బ్రహ్మశ్రీ వేమూరి శ్రీ రామశాస్త్రులవారును, సంస్కృతాంధ్రములలో దమతమ సంతోషములఁ దెల్పు పుచు