పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బందరు.

19



ఆటవెలఁది.ఆట వెలఁది.

డబ్బు దొబ్బు మంచి టక్కుమాటలు సెప్పి
పాడు సేయు నెంతవాని నైస
డబ్బే మగఁడు గాని తాను గాఁడు మగండు
గాన నాటవెలఁది గాన రాదు,8

కందము - చీపురుపుడక .

తిరునామం బిడు వేళను | నర వైష్ణవ మణుల కెల్లఁ బరసాధనమా.
సరయంగ సహహః యీచీ 1 పురుపుల్ల బుధాళి కర్ణ ఫుటరంధ్రగమౌ. ?9

.....................................................................................................................

దైనను మిక్కిలి యుల్లాసముతో నే చదువురుదని నమ్ము చున్నాము. దివాకర్ల తిరు పతి శాస్త్రులు చెళ్లపిళ్ల వేంకటశాస్త్రులు ఆను నీక వీశ్వరులు వైదిక బ్రాహ్మణులు . వీద్దరును గోదావరీ తీరమందలి ధవళేశ్వరమను గ్రామమందుఁ బత్యేకముగా విద్యా ర్థులకొఱకు ఆన్న సత్రము పెట్టి విద్యా దానము చేయుచున్న బ్రహ్మశ్రీ చెర్ల బ్రహ్మయ్య శాస్త్రు ల వారియొద్ద సంస్కృత వ్యాకరణమును సమగ్రముగా సభ్యసించినారు. ఇందు నకు ఫలముగా వీరుభయులును గలసి ధాతురత్నాకరమను పేరుచేఁ బరఁగు సంస్కృ త ధాతువిషయిక గ్రంథమును. కొన్ని దుష్కర నియమములలో రచించియున్నారు. ఇందలి యొక్కొక్క శ్లోకములో నొక్కోక్క ధాతువును గూర్చి వ్రాయంబడినది. ఈగ్రంధ మందే రామాయణకధ వచ్చునట్లుగా రచింపఁబడిన దనుట చేతనే వీరి పాండిత్య ప్రభావము కొంత వెల్లడియగును, పైనఁ జెప్పిన చొప్పున వీరివయస్సు ఇరువదేండ్ల కంటే మిగుల నధికముగాదు. వీరొకరికోకరు బంధువులు కారు. వేఱు వేఱు శాఖలవారు, ఇట్లయ్యును వీరిరువురికిని గల మైత్రి మన బాలురకే కాక పెద్దలకుఁగూడ మార్గద ర్శినీయని చెప్పఁదగినదియై మిక్కిలి యానందదాయక మై యుండును, వీరు తిరుపతి వేంక జేశ్వరులని తమ నామముల నెంతో ముచ్చటగాఁ గలిపి గ్రంథరచన చేయుదురు , వీరు సాధారణముగా నిద్దఱును గూడియే సభలలో తమ నేర్పులను జూపు చుందురు. శతఘంట కవిత్వము చెప్పునపుడు, ఇద్దరిలో నొకరు ప్రథమ చరణమును రెండవారు ద్వితీయ చరణమును తిరిగి యీవిదముననే చెప్పి పూర్తి చేయుదురు, వీరి కవిత్వము పరీ క్షించినచో పైని చెప్పిన విధముగా నిద్దఱు చెప్పినట్లుగా పట్టుపడఁదగియుండదు, శత ఘటక విత్వము. అనఁగా నూఱు మంది జనులు వారివారి యిష్టమును బట్టి కోరెడు నొక్కొ, క్క విషయమును గూర్చి వారువారు నియమించెడి వృత్తములలో కవిత్వము చెప్పుట, ఎవరు ఏయంశమునుగూర్చి యే విధ మైన పద్యమును చెప్పుమని కోరినదియు జాపకముం చుకొని యొక్కొక్క చరణము చెప్పుచు వెళ్లి తిరిగియు నేమియునడుగ కుండనే మొద టినుండిచివర పఱకు 'నెవరు కోరిన పద్యములు వారికిఁ బూర్తి గాఁ జెప్పుచుండ వలయును, ఈకవులు సంస్కృతాంధ్ర భాషలు రెంటియందును దారాళముగ నాశు కవిశ్వమును