ఏలూరు
13
సీసము - జారులు.
లేనిసింగారంబు మేనఁ బూనెడుబుద్ధి కొత్త బట్టలు కొన్ని కొంచుఁగొంచు
తన శిరోజమ్ముల ననుదినంబునను సంపెంగనూనెచే దువ్వి పెంచుకొంచు
తండ్రి సంపాదించుధనము దొంగిలి దాని బోగాలకును ధారబోసికొంచు
'చెలికాడమాటలు చెవిఁబెట్టితల్లిదండ్రులమాట విసముచాడ్పుననుగంచు, 3
తేగీ ॥ ధనము దొరకక పోయిన ధనగృహమ్ము
అందుఁ జోరత్వమున ధసమందుకొనుచు
నిందునందునఁ జెడిపో యినిందలకును
బుట్టలై యొప్పుదురు జారపురుషు లకటా! 3
</poem>
సీసము - కలియుగ రీతి.
వేద వేదాంగాది విద్యల విడనాడి బ్రాహణు లింగ్లీషు భాషు లైరి : క్షత్రధర్మంబుఁ జనియించు రాజకులం బెల్ల జేత హాలంముఁ బూనె వాణిజ్య వృత్తి చే నఱలు కోమటు లెల్ల యజ్ఞయాగా దీకృత్య పరు లైరి ద్విజసేవకత్వవృత్తిని జీవనము సేయు పాదజుల్ ద్విజసేవ్య పదము గనిరి,
తే.గీ: 'హూణు లెల్లను రాజ్య ప్రవీణు లై రి ...
గౌరవము లేనివా రధికారు లై రి
పేరు లేనట్టి వారు కుబేరు లైరి "
కలియుగ పుఁజర్య 'లేమసఁగలము మనము 4
</poem>
సీసము — వేశ్యారీతి..
<poem>రంగుమిఱెడు గాగ రాలచేఁ బూల చే లేనిసింగారమ్ము మేన నూను మోసాలపై తేనెతో సమానంబైన మాటలచే జారుమసము దొబ్బు సంసారము న జ్ఞాని సంచరించెడురీతి జాగులతోడఁ దా సంచరించు జనులందఱును గూడ జారపూరుషులైన స్వలోకోపకృతి యంచు లోన నెంచు, }} ...............................................................................................................
నేఁటిదినమున, సమాజమునలంకరించినట్టియు శత లేఖినీ పద్యసంధాన భౌరేయులను నట్టి యు నీదివాకర్ల తిరుపతిశాస్త్రి గారి యొక్కయు చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి గారియొక్క యుఁ గవితాప్ర భావమునుగూర్చి కొంచెము ముచ్చటింపుదము, ఇపుడు వీరిని నేను దశ ఘంటావధానము --చేయుడని కోరుట శతావధానాటవింజెండాడఁదగు వీరికవితాథా రకిది యొక యడ్డని కాదు. వీరలు పదిశ్లోకమ్ము లెంతలో చెప్పుదురోయను కతూహల మ్ముచేత నే కోరితిని, ఆది వారిరుపది నిమిషములలో నెర వేర్చిన సంగతి యిత్తఱియెల్ల