పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12

శతావధా న సా ర ము. పూర్వార్థము

(నమస్య) మానవతీలలామ కభిమానమె చాలును జీర యేటికిన్ .

ఉ! ఓనవనీతచోర? కృప యుంచి పటమ్ముల నిచ్చి 'వేగ మా
మానము గావుమన్న ప్రజమానిని పల్కుల కెంతో వింతన
వ్వాసన సీమ దోఁపఁ గమలాక్షుఁడు దా నిటు పల్కె మానినీ
మానవతీల లామ కభిమానమె చాలును జీర యేటికిన్ ,.....................3

శ్రీ. శ్రీ. శ్రీ.


విజయ సం॥ ఆషాఢములో ఏలూవీలోని రెండవధానములలోని 50 టికిఁ గొన్ని పద్యములు.

(సీసము ముసలిమగఁడు, పడుచుభార్య)

ద్రన్య సంజాతంబు దగ లేదటంటిమా మూల్గుచున్నది మూలమూల లంటి శయనగృహాదులు సఖ! లేవటంటిమా యవి యపారముగ నున్న వియెసుమ్ము వెనుక దక్షుత యెవ్వరును లేరటంటిమా తల వెంట్రుకలకన్న గలరు హెచ్చు ఉన్న యూరునఁ జెడ్డ లున్న వారంటిమా! సజ్జన వ్రాత మేచక్కి జూడ;

తే| || నయిన నామదికే మొస్వార్థమ్ములేదు
అతివరో చెప్ప నాకు సిగ్గయ్యెడుఁజుమి
యంచు నీలాటి రేవున మించిమించి
పల్కుచుండును వృద్ధుని బాలభార్య ....................1

చంపకమాల _ గోడీ

. కరకరలాడు కొంచెమగుకారము గల్గుఁ బలాండు వాసనా హర మగుఁ గొత్తి మిరయును నల్ల ము గన్పడు నచ్చటచ్చటన్ ధరను. .బకోడిఁ బోలెడు పదార్థము.లేదనితద్రసజ్ఞు.లా దరమునఁబల్కుచుందు రది తాదృశమే యగునంచుఁదోఁచెడిన్..............2

ఇయ్యెడ దేశోపకారియను పఠికలో ( 1893 సం--9 అగస్టు. )

...............................................................................................

ఆర్యులారా! సభాధ్యక్షుని యనుమతినొంది. నేను చేసికొను విన్నపము "పెడచె విని బెట్టక యాలకింపుఁడు, చతుర్విధక విత్వంబులలో నాశు ధార దక్కఁదక్కినకవి త్వములకు శ్రమయుండినను గవియిచ్చవచ్చినంత వఱకాలోచించఁదగు నవకాశ ముం డుటచే సంతకు నాశుధారయే యతిప్రయాసమని నేను నొక్కి వక్కాణింపఁగలను .