పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10

శతావధాన సారముపూ ర్వార్థము


(భీష్ముఁడు) సీసము.

ఎవ్వాఁడు ఖండించె నేపుమీఱెడిపాండునందను సేస నాసంద మొప్ప
నెవ్వాఁడు విష్ణుచే నెలమి జక్రము దాఁ బట్టించి ప్రతినను భంగపఱచే
నేన్వాఁడు శరముల నెసఁగఁ దల్పము చేసి "బాగుమీఱగ నందుఁబవ్వళించే
నెవ్వాఁడు మాఖశుద్ధేకాదశిథి హరి వాసమునకుఁ దానరిగె బ్రీతి
తే.గీ. నట్టి భీష్ముని సర్వ వేదాంతతత్త్వ
నీరరాశిఘటోద్భవు నిర్జరేశ
ముఖ్య సంస్తూయ మానసంపూర్ణబలు ని
వర్లన మొసర్చు కొలఁది. యెవ్వారి కొడవు,..........................3

(శతావధాన విఘటకాః) ప్రహర్షిణీ,

యే కేచి చ్ఛతక నయో యథా ప తేయుః
కుర్వంతు ప్రతిచరణం తథా ప్రయత్నం
లోకేదుర్జనయశసే స ఏవ తేషాం
నో బాధా భవతరుణీవశా త్కవీనాం....................................4

(సీతారామః) మణిబంధనృత్తమ్.

భావయ సీతారామ మముం, కొమద. మారా దాజిసుతం
నిర్జరమాన్యం స్తుత్య గుణం, నిర్జితశత్రం దుర్జనదం,..........5

(సమస్య) అభిలషతి హి వేశ్యాలింగనం సిద్ధ యోగీ.

శ్లో / విపిన మధివసంతం మౌనిరాడృశ్యశృంగం
స్వనగర ముప నేతుం తద్గతా .వారయోషాః
పర మతియతి బుద్ధ్యా సస్త్రీయా ఆజ్ఞ తాయా
అభిలషతి హి వేశ్యాలింగ సం సిద్ధయోగీ.............................6

..................................................................................................

పలరఁగఁ గోనసీమను మహాప్రతిభం గని తేజరిల్లు నీ
తిరుపతి వేంకటేశ కవిధీరుల నెంచ విరించి శక్యమే!

క॥ ధారుణీ నీసద్యశ మే, పారెడు వరతారహీర హారాజ్ఞలస
చ్ఛారద నారద నారద, పౌరదముల గెల్చుచు. సభాస్థలి సెందున్.

విధేయుడు భాగవతుల కృష్ణశాస్త్రి, అని యున్నది.