పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాకినాడ.

5


(లక్ష్మి) మత్తేభము..

కలధౌతాంబరు దేవి నామనముగఁ గాంక్షింతు నెక్కాలమున్
గలధౌతోజ్జ్వలదంగ విభ్రమకళాకళ్యాణజాలాస్పదన్
గలధౌతోదర ముఖ్య నిర్జరమసఃకంజాతసూరాయితన్
గలధౌతాదిధనాభిశోభితమహాగా రావళీ వాసినిన్{{float right|16}

.</poem>

(కఱపు) శార్దూలము,

ధారాపాతము లేక సస్య వితతుల్ తప్తము లయ్యె గడున్
జేరెన్ సర్వజనంబు నీ పురము నే జీవింప, వారందఱిన్
శ్రీరామేశఘనుండు ప్రోచి మును దా శ్రీవృష్టినాక్షామమున్
బాజ దోలెను దానిఁ గోర మరలన్ బాగెట్లగుఁన్ దెల్పుమా17

</poem>

(కావ్యము) స్వగ్విణి.

సార రాజన్యుల జక్క మెప్పించుచున్
జారువాక్చిత్ర విస్తార పద్యములన్
సూరిచేతోలసత్సూన సౌరభ్యమై
మీఱుకావ్యమ్ము నెమ్మిన్ బ్రశంసిం చెదన్.18

</poem>

(వేశ్య) భుజంగ ప్రయాతము.

చలాపాంగ దృష్టి ప్రసారము చేతన్,
విలాసమ్ములఁ జూపివిత్తమ్ము లాగున్
గలావీద్విరాగి ప్రకాండము నైనన్
గలంచున్ భువిన్ విత్త కాం తాజునంబౌ19

</poem>

చంద్రోదయము) ఉత్పలమాల.

శ్రీరమ గేహముల్ గునుకఁ జేయుచుఁ గోకములన్ గలంచుచున్
జారుచకోర సంతతులఁ జక్కఁగ వెన్నెల నాదరించుచున్
మారునకున్ సహా యఁడయి మానీనులన్ గలగంగఁ జేయుచున్
మీఱెడుఁ జంద్రు డుజ్జ్వలతమిస్రమహీధరవజ్రవజ్రమై,20

</poem>

..........................................................................................................

ముంబట్టి ప్రకటించును, శతఘంటకవిత్వము - చెప్పుట మిగుల నరుదైన కార్యము ఈ యాంధ్రదేశమ్మున నిట్టిపనులు చేసెడివారిలో, సిద్ధులు. శ్రీమాక్ మాడభూషి వేం కటాచార్యులవారును బ్ర. శ్రీ దేవులపల్లి సుబ్బారాయుశా స్త్రీ తమ్మన్నశాస్త్రి గార్లును