పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

132

ఉత్తరములు



బ్రహ్మశ్రీ ***** ***** "వెంకట కాసులు గారి సన్నిధికి ****
తిరుపతి వేంకట కవులు చేసిన శ్రవణానంద మను గ్రంధమును చూడవలయును నపేక్ష
చాలాదినముల నుంచి గలవాడనయి యుండి విచారించుచునుండగా తమవల్లి గా ని
కార్యము సానుకూలము కాదని నాకు కొందఱు పెద్దల వల్ల తెలిసినది. గనక సదరు
గ్రంధమును "నాకు బహుమతి చేయవలయునని కొనియాడుచున్నాను, ధనమా లేదు
గ్రంధముల మీదియ పేక్ష యా యింక ను తీర లేదు. కవులున్నూ ధర్మాత్ము లున్నూపండితు
లకు సరస్వతి దాసము చేయువారుసని నమ్మి వ్రాసుకున్నాను. గనుక సదరు గ్రంధము
నేను చూచునట్లు చేయవలయునని కోరెదను.

ప్రవంగ.॥ సం॥' ఆశ్వయుజ శు :1 లు కంకులగుంట,

ఇట్లు సుజనవిధేయుఁడు,
ఆరెళ్ల శేష శాస్త్రులు.