పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

vii


రచియించి రేనియును గాదగుఁ దిర్పతి వేంక టీయ మై" అనీ "మాజాతక చర్య" యను గ్రంథమున వ్రాసికొనియున్నారము గాన నెవ రేది వ్రాసినను చత్కర్తృత్వ ముభయు లకును నుండియే తీఱును. భేదము కూడ నంతగా నుండదనియే లోకుల యభిప్రాయము , నిజముగా నట్లయైయుండునని మేమును ననుకొందుము. రాజులపై మేమురచించిన పద్య ముల నన్నింటిని వేఱుఁ జేసి నా నా రాజ సందర్శనమ ను వేర నింకొక గ్రంథమును గూర్చితిమి. ఈ యుభయ గ్రంథములందును సాధ్యమైనంతవఱకు నాశుదారా కవిత్వమే యుండును. రాజ సందర్శనము లో మాత్రము చెఱి సగమువరకు నాశుధారా కవిత్వ మేయైనను తక్కిన సగమును నట్టిది కాకపోవచ్చును, అనఁగాఁ గాకితము పుచ్చుకొని వ్రాసినది యని మీరూహించుకొందురు గాక ! ఆశుకవు లేగ్రంథము రచించినను నెట్టి కల్పన ఘటించినను జిరకాల మాలోచింరిపరని మాయనుభవము , కల్పనతోఁచుటయే తడవు గాని పద్యరచనకు నేవిధ మైన యాలస్యమును నాశుకవుల కవసరముండదని దృఢ ముగా మేము చెప్పఁగలము. ఇది కొందఱి కతిశయోక్తి గాఁ దోచినను వారి యా క్షేపణకు మేము పాత్రులమగు చున్నారమని విన్నవించికొనుచు, నిప్పటికే విస్త రించి వ్రాసితిమను విసువుతో నింతట విరమించెదము.

ఇట్లు తిరుపతి వేంక టేశ్వరులు