పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

vi


క్తిరంచితకళావిధ్భ స్సహాభాషణం | పౌరాణోక్తి రమంద లౌకిక గిరోన్యస్తాక్షరోక్తి స్సమం | ధీమద్భిశ్చతురంగ ఖేలన మధో సంఖ్యేయపుష్పాళయో | యస్మిత్స్యాద్యుగ పత్త దేవకృతి నామష్టావధానాభిధం! ఆనియష్టావధానమునకును లక్షణము "లేర్పఱచుకొ న్నారము, ఈశ్లోకార్థము బందరు పద్యములకుఁ గ్రింది భాగమున నుదాహరింపఁబడి యున్న ఉపాధ్యాయోపయోగినియందుఁ బూర్తి గా వివరింపఁబడి యే యుస్నది గాన నిటవ్రాయఁబడదయ్యే. అష్టావధానమునకు మాత్రము తెలుగులోఁగూడ లక్షణము మాచేత నే రచింపఁబడియున్నది, అదియిందుదాహరించెదము. ||శా|| పౌరాణోక్తి కవిత్వ పుష్పగణనావ్యస్తాక్షరుల్ లౌక్యగం|భీరోగ్యంచిత కావ్వపాతనక లా విద్భాషణంబుల్ ముదం! బారంగా జతురంగ ఖేలనము నీయష్టప్రచారంబులో |ప్పారున్ శంకర యేక కా లమున నే యష్టావధానమ్మునన్ || మేమేర్పాటుచేసికొన్న దింత మాత్ర మేయైనను నిందు లకు 'యోన్ని యో రెట్లు కష్టము నంగీక రించి చేసినయవధానములు మాత్రమ నేకములుగలవు. ఈవిషయమున నెల్లూరు వెంకటగిరులు ముఖ్యముగా నచ్చటి వారివ్రాతల మూలమున మీకుసాక్ష్యమునీఁగలవు. శతావధాన విషయిక వైలక్షణ్య ముసకు విజయనగరము పూ ర్వరీతిగ నే సాక్షి కాగలదు. ప్రకృత సపుస్తకములో మాకు 30 వత్సరములు వచ్చు టకుఁ బూర్వము రచించిన యవధాన పద్యము లున్న భాగమును బూర్వార్థ మునియం బదపడి రచించిన యవధాన పద్యముల భాగమును నుత్త రార్థ మనియు వాడితిమి. ఉత్త రార్థపూర్తి భగవదేక వేద్యము గాన సశేషము" అని వాయవలసి వచ్చినది, రెండవ కూర్పు నందుఁ దిరిగియు నెచ్చట సేని యవధానములు రచించుటదట స్థించినచో నాప ద్యము లేకాక చిత్తు కాగితములుండియును బకృతము సమయమునకుఁ దటస్థింపని న ర్సారావు పేట మొదలగు నవధానముల యందలి పద్యములు గూడఁ జేర్పఁగలము. ఇప్ప టికి మావయన్సు రమారమి 37 సంవత్సరములు ఇందు తిరుపతికన్న వేంక వేశ్వరుఁడు నాల్గుమాసములు పెద్ద. మేమిరువురమును శ్రీచర్ల బ్రహ్మయ్యశాస్త్రులవారీ ప్రియశిష్యుల ము. ఆయాయీ సంగతులు ప్రకృత గ్రంథమున నచ్చటచ్చట వెల్లడియగును. అందులో బందరు పద్యములలోఁ జిన్నయక్షరములలో ముద్రించిన యుపాధ్యాయోప యోగిని విస్పష్టముగా నొడువుచున్న యది గాన వలసిన వారది చూచుకొందురు గాక! ఇందలియ వధానము లేవో పదిపదకొండు దప్పం దక్కినవన్నియు సుభయకృతములే, నానా రాజు సందర్శనమున "ఒక చరణంబతండు మఱియొక్కటి నేను" అను పద్యముం జూడుఁడు ఆ మాత్ర మేని యేకై క కృతములుండుటకు నిటీవల మేము వేఱు వేఱుచోటుల నివసించు చుండుటయు సమయమున కిరువురమును జేరకుండుటయఁ గారణములు, ఒక్కరు