పుట:Sasi Kala, Adavi Bapiraju.pdf/97

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
83
శశికళ
 


అమృత వాహినిరీతి అవతరించితివీవు
ఆనందరూపవై అధివసిస్తివి మ్రోల

          దివ్యభూముల కెటకొ తేల్చుకొని పోతివే !
          దీనజీవిని నన్ను దివ్యుణ్ణిచేసితే !

హృదయాన మోముంచి ఒదిగితిని ఒడిలోన
కదియించి కౌగిటను నుదిటపై చుంబించి

          "ఓప్రభూ నీవిద్య
          నా ప్రణయ" మన్నావు
          సౌరభావృత హస్త
          సంస్పర్శ ఓషధై

నూత్న శక్తినిపొంది నూత్న జీవమునంది
యత్న కార్యోన్ముఖుడనై నిలిచితేరాణి!

          దివ్యభూముల కెటకొ తేల్చుకొనిపోతివే !
          దీనజీవిని నన్ను దివ్యుణ్ణిచేసితే !