పుట:Sasi Kala, Adavi Bapiraju.pdf/75

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
61
శశికళ
 

అంతప్రేమ కనుల వెలిగె
ఆరతిగా అందుకొంటి

              వెలుగుల వెనకై నవ్వులు
              తలపై వాలిన పువ్వులు

                          లోచనాల హాస లీల
                          లోలాక్షీ ప్రియ బాలా !

చక్ష్వాంచల స్రావితమై
పక్వాంచలములు చిందెను

              ఆనందపు భాష్పములో
              ఆర్తి కరిగి కన్నీ రో

                          లోచనాల హాస లీల
                          లోలాక్షీ ప్రియ బాలా !

ఆకాశము నీల నిధులు
అబ్థి సుడులు నీలపధులు

             నీ కన్నుల నీలి నవ్వు
             నీరు నింగి తెలిసేయునొ

                          లోచనాల హాస లీల
                          లోలాక్షీ ప్రియ బాలా !