పుట:Sasi Kala, Adavi Bapiraju.pdf/74

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
శశికళ
60
 

కంటినవ్వు

లోచనాల హాస లీల
లోలాక్షీ ప్రియ బాలా !

కనుపాపలలో హేలలు
కనురెప్పల నీ లాలూ

            కనుకొలకుల కాంతి కళలు
            కనుమూతల పైన కలలు

                       లోచనాల హాస లీల
                       లోలాక్షీ ప్రియ బాలా !

పక్ష్మకాండ పటము వెనుక
భరత నృత్య లాసికయై

            అష్ట నాయికల భావము
            లభిన యించె కంటి నవ్వు

                       లోచనాల హాస లీల
                       లోలాక్షీ ప్రియ బాలా !