నీకై నేనే నిత్యసుందరిని
నీ ఆనందము నేనే యనునట
నియత దేశికై ప్రియము సెప్పునట
మనుజుని ఉన్నతి కని పొంగెదవే !
కవియే యైనా గాయకుడైనా
రవిలా రంగుల రాజే నయినా
రాజ్యము లేలే పూజ్యుడె అయినా
ఆజ్యము పోసే యాజ్ఞికుడైనా
మతకర్తైనా శ్రుతికర్తైనా
వితములు తెలిసిన విజ్ఞుండైనా
ఆశయ ప్రణయము ఆరాధించును
ఆమెయె అతని ఆతంబనమని
మనుజుని మనుగడ వినిపించితివే
మినుచెలి శశికళ ! ప్రణయవు దేవీ !
నీవే ఆశవు నీవే ఆశయ
మీవే నా దివ్యావతరణమవు
నేను నరుడనట నీ వమర్త్యవే
నీలో నేనై నాలో నీవై
మనుజుని మనుగడ వినిపించితివే !
మినుచెలి శశికళ ! ప్రణయిని ! దేవీ !
పుట:Sasi Kala, Adavi Bapiraju.pdf/72
Jump to navigation
Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
శశికళ
58
