పుట:Sasi Kala, Adavi Bapiraju.pdf/71

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
57
శశికళ
 

ఆశయదేవి

మనుజుని మనుగడ కని కృంగితివే
మినుచెలి శశికళ ! ప్రణయవు దేవీ !

తనలో దాగిన రాక్షసత్వమును
మనుజు డెప్పుడూ చెరవిడదీయును

                చీల్చి చెండునట మానవత్వమును
                నిల్చును ఘోరపు నీడై దారుల
                              మనుజుని మనుగడ కని కృంగితివే !

ఆతని వెలుగై ఆతని ఛాయగ
అనుసరించునట ఆశయ దేవియు

               మనుజుని లోనే మను దేవత్వము
               ప్రణయ పవిత్రము పరవశ రూపము
                              మనుజుని మనుగడ కని కృంగితివే !

కాకుము పసరము కాకు పిశాచివి
లోక కంటకుడవై కూలకురా

               ఊకొట్టుము ప్రణయోక్తుల నరుడా
               సేకరించుముర శిల్ప రసజ్ఞత