పుట:Sasi Kala, Adavi Bapiraju.pdf/70

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
శశికళ
56
 

తంత్రి స్పందించుతూ
తల వాల్చి పాడుతూ

                నను ముంచు నీపాట నవ్యమయ్యే సిగ్గు !
                బాలవే నీవెపుడు గోలవే బేలవే !

నీలి కనురెప్పలో మేలమాడే సిగ్గు
అందాల నీపెదవి అలమిపోయే సిగ్గు

                దివ్య గాంధర్వాన నవ్యమయ్యే సిగ్గు
                సిగ్గులను మాలగాచేర్తువే నాగళము !

                          బాలవే నీవెపుడు బేలవే గోలవే !