పుట:Sasi Kala, Adavi Bapiraju.pdf/69

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
55
శశికళ
 

త్రప

         బాలవే నీ వెపుడు
         గోలవే బేలవే !

పరమ సౌందర్యాలు
పడతి నీ కన్ను లే

         కన్నులలొ దాగెనే
         కమ్మన్ని సిగ్గోటి

                 బాలవేనీవెపుడు గోలవే బేలవే !

ఉదయ సంధ్యల ఎరుపు
పెదిమెలలొ తేనెలే !

         తేనెలో ఒదిగింది
         తీయ తీయని సిగ్గు !

                  బాలవే నీవెపుడు గోలవే బేలవే !