ఈ పుట అచ్చుదిద్దబడ్డది
శశికళ
50
కోకిలల కంఠాన
మూకత్వమే చాలు
సెలయేటి పతనాల
జలము లింకిన చాలు
సంగీత మేలనే ?
నీవు కనరాని నా
కీ విపంచది ఏల
ఈ వేణు వెందుకే
ఈ హంగు లెందుకే
సంగీత మేలనే ?
పొంగేటి లయలేల
సంతోషయే లేని జన్మకిక
సంగీత మేలనే ?