పుట:Sasi Kala, Adavi Bapiraju.pdf/61

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
47
శశికళ
 

గాఢ నిద్రను సోలినవి న
క్షత్ర బాలలు ఒడలు తెలియక

                  వాని సౌందర్యాల మధ్యను
                  వాలియున్నది ఒక్క సోయగమూ !

"ప్రేయసీ !" యను నాదు పిలుపును
"ప్రేయసీ !" యను మారుమ్రోతయు

                  మేలుకొలిపెను తార బాలల
                  మేలుకొలిపెను సర్వ సృష్టిని !

తారకా బాలికల నడుమను
కోరికల ప్రోవైన నిన్నూ

                  మేలుకొలిపెను పిలుపు పాటలు
                  జాలిగా ఆనంద భైరవిలో !

సృష్టి అంతా ఝల్లు మన్నది,
చేష్ట లందెను కాల బాలిక
ఘల్లు మన్నది లోకనాట్యము

                 ఫుల్లమై రస దివ్య పుష్పము
                 వెల్లువలు గంధములు నింపెన్.