పుట:Sasi Kala, Adavi Bapiraju.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శశికళ

46

మేలుకొలుపు


సృష్టి అంతా నిశ్చలమ్మయె
తుష్టి తీరక నేను మాత్రము

                కాలమంతా నిదురపోయెను
                మేలుకొని నే నొకడ మాత్రము !

మినుకు మినుకను తారకలలో
కునుకు లాడెను కటిక చీకటి

                కన్ను మూసిన పూలప్రోవుల
                తెన్ను తెలియని గంధ బాలిక !

ఇంతలో ఆ నిశ్చలతలో
ఇంతలో ఆ సుప్త జగతిని

                నిదురలోనివి తీయటూర్పులు
                చెదరి తేలుతు నన్ను చేరెను !

"ప్రేయసీ !" అని గద్గదికమై
పిలిచితినే వణకిపోతూ !

                "ప్రేయసీ !" యని మారుమ్రోగె వి
                హాయసీ పధి దెసల దెసలన్నీ !