పుట:Sasi Kala, Adavi Bapiraju.pdf/33

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
19
శశికళ
 

లోకము

చంద్ర లోకం తూర్పుదెసలో
సూర్యలోకం పశ్చిమంలో
         చిన్నిలోకం ఒకటీ ఉన్నాదే !
                 ఓనా వెన్నేల చిన్నారి పడుచా !
                         ఆ లోకమేలే
                 కన్నెరాణివి నువ్వే నువ్వేనే !

వాడిపోవని పూల తోటలు
నీడ లెరుగని నిండు పున్నమ
          పరిమళాలే పిన్నవాయువులూ
                 ఓనా వెన్నేల చిన్నారి పడుచా !
                        ఆ జగతి వెలిగే
                 వన్నె లాడివి నువ్వే నువ్వేనే !

నింగి నీలిమ కంటి బొమలూ
ముంగురులె మొయిల గములూ
తొంగలి రెప్పలె ఇరుల కారంచుల్
          ఓనా వెన్నేల చిన్నారి పడుచా !