పుట:Sasi Kala, Adavi Bapiraju.pdf/28

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
శశికళ
14
 

ఎవరివో ఆ కలస్వనాలు

 
ఎవరివో ఆ కలస్వనములు
ఎవరిదో ఆ మధురగీతము !

           భువన మోహనరాగ మొక్కటి
           పొంగిపొరలెను దెసలు మునిగెను

ఇటులచూచితి అటులచూచితి
ఎటుల కనినను ఎవరు లేరూ

           తీపి బరువులగీతి మాత్రము
           ఓపలేనీ నన్ను ముంచెను

శిల్ప ప్రతిమై చేష్టలుడిగితి
కల్పములు వే కంగినవి హృది

           గానమది అతిలోకమై చవ
           లానె పాల్కడలిలో అలలై

గాయనీ ఆబాల ఎవరో
ఏ అనంతములోన దాగెనో

           ఎవరివో ఆ కలస్వనములు
           ఎవరిదో ఆ మధురగీతము !!