పుట:Sasi Kala, Adavi Bapiraju.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

5

శశికళ



కిన్నెర తీగల మీటితి
మిన్నుదరియు రాగంలో
వెన్నెలలో కరుగు గీతి
నిన్నెపాడి నిన్నె వెదకు
       నీకై నే ఎదురుచూస్తి
       నీకై నే వెదకినాను

తపసైన నిరీక్షణలో
తలపులతో బొమ్మైతిని
   నాతోనే లోకాలూ
   నాతోనే కాలాలూ
       నీకై నే ఎదురుచూస్తి
       నీకై నే వెదకినాను

కనుతెరచిన కలల మధ్య
కలలెరుగని గాఢనిద్ర.