పుట:Sasi Kala, Adavi Bapiraju.pdf/122

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
శశికళ
106
 

             అమృ తాప్లావితతనూ
             కమనీయ మూర్తి నై

                  నిత్య విద్యా హృదయ
                  మృత్యుంజయుడ దేవి !

రాకేందు బింబాస్య
నీకంఠమే జ్యౌత్స్ని

             కాపుంజ మంజుల సు
             రూపమై దివ్యమై

భవదీయ సంగీత
పరమ శోభాకాంతి

             వేలలే ప్రసరించె
             మూలాలు పులకించె

వనధి కలశాంబుధై
జనులెల్ల దేవులై

అబ్ర విగ్రహుడ శ
బ్ద బ్రహ్మనై నేను,

             నిను పొదివికొంటినో దేవీ !
             నీవు ప్రణవస్వరూపవే దేవీ !