పుట:Sasi Kala, Adavi Bapiraju.pdf/121

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
105
శశికళ
 

గ్రీవ గంగోత్తరి

గ్రీవ గంగోత్త రీ
పావనోద్భూత మం
దాకినీ స్వచ్ఛ మ
స్తోక సౌందర్యమై !
నీ విమల గాంధర్వ
మావిర్భవించినది

             ఆనంద పరవశుడ
             అల భగీరధుడనై

                     నిలువెల్ల పొంగితిని దేవీ !
                     కలుషరహితము జగము దేవీ !

అమృతకలశము గళము
అమల మధుధారగా

             నీగాన మాధుర్య
             మాగమించెను

ముల్లోకములు గాన
కల్లోలములు నిండ