పుట:Sasi Kala, Adavi Bapiraju.pdf/118

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
శశికళ
102
 

          స్థితియన తెలుపుమని
          చతురమతి కోరితివి

                 నాకు శిష్యవు దేవి నీవూ !
                          ప్రణయ మూర్తీ !
                 నాకు దేశికవే ! దేవి నీవూ !

విమల గాంధర్వమే
కమనీయములు శ్రుతులు
సప్త స్వరోద్భవము
దీప్త మేళస్తితి

          మూర్ఛనలు రాగాలు
          ప్రస్థార గమకాలు
          విస్థారిత స్థాయి

గాంధర్వ కావ్యాది
సౌందర్య రూపమని

           దేవి నీరూపమే
           భావాత్మయై వెలిగె

                  నాకు శిష్యవు దేవి నీవూ !
                            ప్రణయ మూర్తీ !
                  నాకు దేశికవే ! దేవి నీవూ !