పుట:Sasi Kala, Adavi Bapiraju.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

93

శశికళ

మన చెలిమి

నా సఖీ మన చెలిమి
వేసటేనట భువికి

         కాసంత ఉపకారి కాదంట మనుజునకు
                   నా సఖీ ! నా సఖీ !

జీవిత విధానాలు
భావి కర్తవ్యాలు

         ఎరుగ లేనే లేని
         ఎదురుకోనే లేని
         పాట లెందుకటంచు పదములేలా అంచు
         పలుకుదురు భాషణలు చిలుకుదురు దూషణలు

                   నా సఖీ మన చెలిమి
                   వేసటేనట భువికి !

జుమ్ముమను మధుర శ్రుతి
తుమ్మెదలు ఆడవా ?

         కొమ్మ కొమ్మకు తేలి
         కోకిలలు పాడవా ?
         అవి వట్టివమ్మంట అర్ధరహితమ్మంట.