పుట:Sarvei ganita chandrika.pdf/18

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


చతురము, ఘనము

2 వ సూ.

పొడుగును వెడల్పును గలది చతురమనియు, పొడుగును వెడల్పును లోతును (లేక ఎత్తును) గలది ఘనమనియు తెలిసికొనవలెను.


ఒక సంఖ్యను, దానికి సమానమగు సంఖ్యచే రెండుసార్లు హెచ్చింపగా వచ్చు మొత్తము ఘనమగును. ఉదా. 2, దీనికి ఘనమెంత?

రెంటికి సమానమగు సంఖ్య రెండు, కాబట్టి 2ను 2 చే హెచ్చింపగా వచ్చునది 4. దానిని మరల 2 చే హెచ్చింపగా వచ్చునది 8. కనుక 2కి ఘనము 8 యని చెప్పవలెను. ఇట్టులే 3, 4, 5, సంఖ్యలకు గ్రమముగా