పుట:Sarvei ganita chandrika.pdf/14

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


కృత్యాదికము.

కం. శ్రీరమణవంద్య చరణాం
భోరుహ గర్వోన్నత త్రిపురదానవ సం
హారా యాశ్రితజన హృ
త్కైరవరజనీశ కాశికా విశ్వేశా.

తే.గీ. అవధరింపుము బాలురకైన దెలియు
రీతి బద్యంబులందు ధాత్రీగణితము
విపుల విషయాన్వితంబయి వెలయుచుండు
నట్లొనర్చెద గొను భవదంకితముగ.

తే.గీ. పద్యములయందు జేరి గుప్తముగనుండు
విషయములు గద్య శైలిలో విశదపఱతు
నన్నపూర్ణేశ్వరా త్వత్కపాతిశయము
నంది సర్వేగణితచంద్రికాఖ్య కృతిని.

తే.గీ. నాకుసంభవు సత్యవతీకుమారు
బాణు భవభూతి దండి సుబంధు భాను
భారవి మురారి జోరు మయూరు గాళి
దాసు బిల్హణు మల్హణు దలతు భక్తి.

తే.గీ. వినయచిత్తుండ నగుచు గవిప్రకాండు
లైన నన్నయభట్ట తిక్కన్నయజ్వ
శంభుదాసాదులను వేడు చదలువాడ
కోటినరసింహుడను బుధకోటిహితుడ.