పుట:Saripadani Sangatulu by Bellary Raghava.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మొదటి రంగము.

భీమ:- లీలా! "గతస్యశోచనా నాస్తి". సుఖదు:ఖములు కావడి కుండలు. ఆపిల్లకర్మ, బ్రహ్మఘటన. మనము చేయునదేమి?

లీల:- ఈమాటలువినుటకు నాచేతగాదు. మీరేమైననుచేయుడు. (అని నిష్క్రమించును.) (భీమసేనరావు లీల వెళ్ళినతరువాత లేచి, యిటు నటు చూచి, లోనికి తొంగిచూచి, ఎవరినో రమ్మని సైగ చేయును.)

తార ప్రవేశము.

భీమ:- అవిషయ మేమైన యోచనచేసితివా? లేదా? తార:- నేనేమి యోచన చేయవలయును? భీమ:- ఏమి యోచనచేయవలయునా? నామాట వినకపోయిన నీకు కలుగబోవు అనుమానము గుఱించి. తార:- నాక్కొకటియు తోచదు. నీవుతప్ప నాకెవ్వరు దిక్కు? నాకేమి యోచనచేయుటకు తెలియును. ఏడ్చుటకుమాత్రము వచ్చును. భీమ:- తిక్కపిల్లా! ప్రపంచములో విధవలు లేరా? వారికిట్టి కష్టములు రావా? తార:- ప్రపంచము సంగతి నాకేమి తెలియును? నీవేనాకు సర్వ ప్రపంచము. భీమ:- అందుకే నేచెప్పినట్లు వినవలెను. చూడు! నీసమాచారము, గుట్టు, లోకులకు తెలిసినయెడల ఎవ్వరు నిన్ను దగ్గరకు రానివ్వరు. నీవు దిక్కులేక కష్టపడవలసివచ్చును. తార:- నీవుకూడ దగ్గరకు రానియ్యవా? భీమ:- వెఱ్ఱిదానా! అది నాకు మాత్రము సాధ్యమా? ఇప్పుడు నీకు వెంట్రుకలు తీయలేదనియే స్వాములవారు నాయింటికి రాకయున్నారు. దానిపై నీవు 'ఇట్లు'న్నావని తెలిసినయెడల చెప్పవలసిన యవసరమేలేదు.