పుట:Saripadani Sangatulu by Bellary Raghava.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ రంగము.


ప్రా-ఇన్ :- రావుజీ! మీకుమారుడు మీపై ఏలదోషం ఆరో పించును? మీకుమారుడు మరియొక సమాచారము చెప్పియు న్నాడు.

భీమ. _ ఆదియేమి?

ప్రా.ఇన్.:- తారాబాయి నీఇల్లువిడచినందులకు కారణము తెలి పియున్నాడు. తాను తారాబాయిని బహిరంగముగా వివాహ మాడుటకు నిర్ధరించినట్లును చెప్పియున్నాడు!

భీమ: - అయ్యయ్యో! కులనాశకుడు పుట్టెనే నాకడుపున నేనేమి చేయుదు. వీడు పుట్టిన నాడె చచ్చియుండ కూడదా?

ప్రా.ఇన్.:- అట్లనకుడు, రాజారావు నవయువకులకు భూషణప్రా యము అట్టివారుండుట చేతనే పురాతన హీఁదూసంఘశక్తి సంపూర్ణముగా అంతరింప లేదని ధైర్యము కలుగుచున్నది.

భీము. __ ముందుగతి యేమి? ప్రమాదము సంభవించెనే. ఇట్టి - నవ మానముక లిగినపిదప నేను ఎట్లు జీవింపగలను?

ప్రా.ఇన్/:_ భయపడకుడు. మీరు చేసిన పనితప్పు. మిక్కిలి చెడ్డది. అయినను నేను మీకు సహాయము చే సెదను. మీరునా నెంబడి కలెక్టరు దొరగారియొద్దకు రావలెను. జరిగినసంగతులు అనగా మీకు “సరిపడని సంగతులు” అన్నియు వారికి తెలి చేసి వారిక్షమాపణ వేడవలయు. నేను మీకు సహాయము చేసి ఈ కేసు వితుడ్రాచేయిం చెదను.

భీమ: – (ప్రాసిక్యూటింగు ఇళ్ స్పెక్టరు చేతులు పట్టుకొని) అయ్యా మీ రేనామానము కాపాడినట్లు.

ప్రాక్:- రావుజీ! మరియొక్క మాట. ఈసహాయము మీకు నేను చేసినందుల కై మీరు బహిరంగముగా సంపూర్ణమైన ఉత్సాహముతో మీకుమారుని వివాహము చేయవలెను.

భీమ: - (నిర్విణుడై యోచించును )

81