పుట:Saripadani Sangatulu by Bellary Raghava.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడవ యంకము


భీమ:- ప్రభువుగారు మన్నింపవలెను. నాకేమిఅర్ధముకాదు. నాకుకొంత అవకాశమిచ్చిన నాకుమారునితో మాటలాడి పిదప విన్నవించెదను.

న్యాయా:-( ప్రాసిక్యూటింగు ఇంస్పెక్టరును తమవద్దకుపిలిచి యేమో రహస్యముగామాట్లాడి) ఈనాటి కోర్టుచాలించియున్నాము. ఈకేసుమరల మరునాటికి వాయిదావేసి యున్నాము. శ్రీధరశాస్త్రిని స్వంతజామీను పూచీపైన విడుదలచేసినాను. (అనిలేచిపోవును, అందరూలేతురు.)

(యవనికపడును)

సరిపడని సంగతులు

మూడవ యంకము - రెండవ రంగము.

స్థలము-కచ్చేరిముందు—వీధి - సాయంకాలము.

ప్రాసిక్యూటింగు ఇంస్పెక్టరు, వకీలు భీమసేనరావు, మాట్లాడుచు ప్రవేశింతురు.

ప్రా-ఇన్:- భీమసేనరావుగారు! మీరునాకుస్నేహితులు. నేనుఎల్లప్పుడు మీక్షేమమును కోరువాడనేకాని అన్యుడనుకాను. మీరు ఈవిషయమున యదార్ధము పలుకవలయును.

భీమ:- నాకుమారుడు మీతో ఏమిచెప్పెను?

ప్రా-ఇన్;- ఉన్నయుదంత మంతయు తెలిపియున్నాడు. మీరు దాచి ప్రయోజనములేదు. చోరీ చంద్రహారము నీమేజాలోనుంచి క్రిందపడియుండగా మీనౌకరు యల్లప్ప దానిని తీసి తనకిచ్చెనని చెప్పియున్నాడు. అదియుగాక దీనియందుండిన దసపదకమునూఆచార్యులవారు శ్రీధరశాస్త్రియింట పడవేయించిన సమాచారమును చెప్పియున్నాను. ఇంకేమిచెప్పవలయును.?

భీమ:- అయ్యా! నీకులోకానుభవము ఉండియు ఇది కుట్రయని తెలుసుకొన పోతిరే.

80