పుట:Saripadani Sangatulu by Bellary Raghava.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొదటి అంకము

విద్యా:--మహాస్వామి! సత్యమాడుమని నిన్నడుగవలెనా? "సత్యంవద, ధర్మంచర" అన్నారు స్వామి! వేదపురుషుడు.

న్యాయా:--ఏమో? సత్యంవదనా?

విద్యా:--అయ్యో!అట్లుగాదుస్వామీ! మాతాతగారు హరిశ్చంద్రనాటకముగా సంస్కృతములోని చండకౌశికమును ఆంధ్రీకరించినారు. తండ్రిగారన్ననో, అ చ-ఐదు- మహాయజ్ఞములుచేసినారుస్వామి! గొప్పవారుస్వామి! భీష్మపంచకము-ఐదుదినములు ఉపవాసము - గంగాపానములేక చేసినారుస్వామి! ఇంకనాసమాచారము నేను చెప్పుకౌనవలసినదిలేదు. మాస్వాములవారు నాకు 'సత్యప్రియ ' యను బిరుదు నిచ్చినసంగతి మీకి తెలిసియే యుండవచ్చును. ఇదే వారిశ్రీముఖము. తీసికొనివచ్చియున్నాను. (అని చంకలోనికట్టనిచ్చును)ల

న్యాయా:--ఆచార్యులవారు! అక్కరలేదు. తొందర పడకండి. మీసాక్ష్యము, ముగిసినది. చదివి చెప్పుతావినండి.

విద్యా:--హెవండి! మీతండ్రిగారికి నాపైనమిక్కిలి విశ్వాసము. మీరిట్టిధర్మప్రబువులు. 'సకలైశ్వర్యాబి వృద్దిరస్తు" (అనుచు క్రిందికిదిగిపోవును)

ప్రా-ఇన్ :-- హెడ్డుకానిస్టేబిల్ మధురపిళ్లె. (అనిపేరు మూడు మారులు పిలుచునంతనే అతడువచ్చి సాక్షిస్థానమందు నిలువగా ప్రమాణము చేయింపబడును) పోయిన నెల 8వ తారీఖున రాజావీరణ్ణ శెట్టిగారు మీకు చేసిన రెపొర్టుఇదియేనా?

హెడ్ కా:--(రెపొర్టుచూచి) ఇద్దాసార్.

ప్రా ఇన్ : -- దీనినిగురించిమీరు విచారణజరిపితిరా?

హెడ్ కా;-- సబ్ ఇన్ స్పెక్టరు లీవుపైనయుండిరి. నేనుదా ఇన్వెస్టిగేషన్ చేసినాను.

ప్రా-ఇన్:-- మీఇన్వెస్టిగేషనులో అపరాదియగు శ్రీధరశాస్త్రి గారియిల్లు సొదాచేస్తిరా?

78