పుట:Saripadani Sangatulu by Bellary Raghava.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడవ అంకము


విద్యా:--శెట్టిగారి కుమారుడువచ్చి..... (అనుచుండగా భీమసేనరావుగారు దగ్గుదురు. ఆచార్యులవారు ఊరక నిలుతురు)

న్యాయా:--శెట్తిగారి కొమారుడు ఈ చోరీసంగతిచెప్పెనా?

విద్యా:--లేదండీ, లేదు. ఆపిల్లవాడి కొంచెము కన్యకాపరమేశ్వరీ దేవాలయపువిషయము మాట్లాడుటకు వచ్చియుండెను.

న్యాయా:--(నవ్వుచు) అట్లనా! తొందరపడకండి ఆచార్లవారూ!అపరాది ఇంటికి పోవుటకుముందే, వారి ఇల్లు సొదాచేయుబడునను సమాచారము మీకు తెలిసియుండేనా,లేదా?

విద్యా:--లేదుస్వామి, లేదు.

న్యాయా:--మీరేమైననూ అపరాధీల్లుసొదా చేయవలెమమొ హెడ్డుకానిస్టేబిల గారికిముందుగానే చెప్పియుంటిరా?

విద్యా:--హెడ్డుకానిస్టేబులుగారు డైరీలో ఏమయిన వ్రాసినారా ఈసమాచారము?

న్యాయా:--ఏదోకొంచెము వ్రారాసియున్నది. దానిసమాచారము మీకెందుకండి. మీకును హెడ్డుకానిస్టేబిలుకును జరిగిన సమాచారము చెప్పండి.

విద్యా:--మధుపిళ్ళేగారికి ఆంధ్రభాషయందంత పరిచయములేదండి. వ్యాకరణయుక్తముగా నేనాడినమాటలు వారికర్ధమాయెనోలేదో, వారు ఏమివ్రాసినారోగాని నేను చెప్పినదంతే, "శ్రీధరుడు బీదవాడు. దారిద్ర్యము, కష్టము, తాపత్రయములు హెచ్చు, ఏదోఆశ, పాపము బ్రాహ్మణుడు. ఎక్కువతీక్షణము వలదు"అని ఇంతమాత్రము చెప్పితినండి.

న్యాయా;--హెడ్డుకానిస్టేబిలు ఏమిబదులు చెప్పెను.

విద్యా;--ఏమెలేదు. ఇన్ స్పెక్టరుగారు శ్రీధరుని ఇల్లు సోదాచేయమంటారు అనికొంచెము చూచనసేసిరి.

న్యాయా;--అయితే అపరాది ఇల్లుసొదాచేయబడునని వారి ఇంటికి మీరు పొవుటకు ముందే తెలిసియుండెను గదా? సత్యం చెప్పండి