పుట:Saripadani Sangatulu by Bellary Raghava.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడవ రంకము


శ్రీధర:--ఆచార్లవారూ! మీరు శవసంస్కారకార్యమున నాకు సహాయముచేయుటకు వచ్చియుంటిరా?

విద్యా:--ప్రమాణముగ.

శ్రీధర: అయిన శవమును మోయుటకై ద్రవ్యముగావలెనా?

విద్యా:--అందు తప్పేమి? అదిప్రకృతిసంప్రదాయము. దేశాచారము.

శ్రీధరు;--మీఆచారమునకు దయాదాక్షిన్యములేదా?

న్యాయా:-ఈచర్చ అసంగతము.

శ్రీధర:--క్షమించండి... ఆచార్యులవారూ! మీరు కుండల దగ్గరకుపొయినప్పుడు నేను నిజముగా ఆక్షేపించితిమా? ప్రమాణపూర్వకముగా చెప్పండి.

విద్యా:--(కోపముతో) నేను ప్రమాణ ముచేస్తానా? నేనుమీవలె జాతిభ్రష్టుడనుకొంటిరా? మీవలె సంధ్యావందనము విడిచితిననుకొంటిరా? ఈమాననష్టమును శ్రీమ్యాజిస్ట్రేటువారుగమనించవలె, మీతండ్రిగారికి నాపైన ఎంతోభక్తి.

న్యాయా:--(వారించి) కోపపడకండి ఆచార్యులవారూ! వారు అడుగవలసిన మాట అడగినారు, పోనిండు, ఈ పంచాయతీనామాలో అపరాధి, సొదాకాలందు ఆటంకము చేనట్లు మాటయే లేదే?

విద్యా:--పోలీసువారు మరచిపొయియుండవలెనండి. పాపము పెద్ద రికార్డు వ్రాయునప్పుడు ఎంతయని జ్ఞాపకము పెట్టుకొంటారు?

న్యాయా:-- ఆచార్యులవారూ! అంతాకలసి మీరెంత కాలమా యింటిలో నుంటిరి?

విద్యా:--ఏదీ, కొంచెముసేపండి. ఉన్నంతసేపు భీమసేనరావు ప్రక్కననేయుంటిని. ఆకుండల సమీపమునకు పోనేలేదు.

న్యాయా"--(నవ్వుచు) ఓహో! ఆచార్యులవారూ! క్రొత్తసంగతులు చెప్పుచున్నారే? అట్లనా? మీకు శెట్టిగారింటి చోరీవిషయము మొదట యెప్పుడు తెలిసినది?