పుట:Saripadani Sangatulu by Bellary Raghava.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీరామచంద్రప్రసీద.

సరి పడని సంగతులు

మొదటి యంకము.

మొదటి రంగము.

(వకీలు భీమసేనరావుగారియిల్లు. ఉదయము సుమారు 8 ఘంటలు.)

భీమ:--(ఉప్మాతినుచు) తారవిషయమును యోచనచేసితివా?

లీల:-- యోచనచేసితిని. వెంట్రుకల తీసియే తీరవలయునా? ఈ క్రూరకర్మ చేయవలసినదేనా? ఈఆచారము మిక్కిలి ఘోరమైనదని మీకు కొంచమైనను మనసుకు రాలేదా?

భీమ:--స్వాములవారు ఆజ్ఞాపత్రికకూడ పంపియున్నారే! (అనుచు మేజాలోని డెస్కునుంచి వెదకి ఒక జాబుపైకితీసి కన్నులకద్దుకొని చదువును)

"మా మఠమందే అభిమానముకలిగి మాఅనంతశిష్యకోటికి శేఖరుడైన శ్రీమట్టీ కాచార్య సిద్ధాంత ప్రచారకమణిప్రాయుడైనాస్మత్కృతపాపాత్ముడగు భీమునకు ఆజ్ఞాపించిన శ్రీముఖ పత్రిక---

మీ అక్క కుమార్తె, భర్తను పోగొట్టుకొనియు సకేళియై మూడుసంవత్సరములుగా మీయింటనున్నదని ముద్రాధికారుల ద్వారాతెలియవచ్చుచున్నది. ధర్మశాస్త్ర ప్రకారము నీవింకను ఆబిడకు కేశఖండ్నము చేయకున్నావు. ఇట్టిదోషమువలన నీకు నీభార్యకు రౌరవాదినరక ప్ర్రాప్తియగుటయేగాకజగద్వంద్యమైన సిద్ధాంతముంకేలోపముకలుగును. అదియునుగాక, నీవాపిల్ల్కు కేశఖండనము చేయించువరకును, ఆస్మత్పాదకమల