పుట:Saripadani Sangatulu by Bellary Raghava.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఐదవ రంకము


ఖ్యముల మనము గాపాడుకొన్నజాలును. చచ్చినవారి శార్ధమునకంటె బ్రతికినవారి సౌఖ్యమునందు శ్రద్దవహించుటయే నిజమైన ధర్మము.

తార:-అయ్యా! ఎండ ఎక్కుచున్నది. నేనేపోయి శెట్టిగారి నడిగి సహాయము చేయమని.....(అనుచుండగా)

లీలావతి ప్రవేశము.

(తార ఒక్కనిముసము ఆశ్చర్యము నభినయించి పిదప తటాలున లీలావతిపాదములపైబడును. శ్రీధరుడు ఏమియుతొచక నిలుచును. లీలావతి తారను సమీపించును. లీలావతి తారను మరల కౌగలించికొని ముద్దిడి)

లీలా:- బిడ్డా! మాయందరికంటే నీవే పరిశుద్ధురాలవు, నీవేపాపముచేయలేదు. ఇప్పుడ ప్రశంసవలదు. జరుగవలసిన కార్యములున్నవి. ముసలితల్లి మరణమునొందిన విషయమునువిని తక్షణమే వచ్చితిని. ఇచ్చటి సందర్భములు నాకు తెలిసినవి. నీవుపడిన బాధలన్నియు తెలిసికొన్నాను. ఇప్పుదు నిరాటంకముగ నీచెంత నిన్ను నాబిడ్డవలె పొషించుటకు సిద్దురాలుగనున్నాను. అది ఇకముందుపని, ప్రస్తుత మీదేహమునకు సంస్కారము చేయవలెను.

తార:-అమ్మా! నాకొరకెంత సాహసముచేసితివి? నీకుకలుగబొవుహింస ఇందుకైనను యొచనచేయక పొతివే? పొమ్ము నిన్ను ప్రార్ధించెదను. నీవింటికి పొమ్ము.

లీలా:-తారా! స్త్రీలందరు దుర్బలులని తలచితివా? ఒక్కనాడైనను తమశక్తిని ఈమగపందలకు తెలియచేయ శక్తులుగాక పొవుదురా?