పుట:Saripadani Sangatulu by Bellary Raghava.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ రంగము.


మధుర:- జోస్యర్ చెప్పింది రొంబసరి. ఇప్పుడు దా నా కేసు పళ పళయని పత్తా అయిపూయిడ్సింది. స్టేషకుపూడ్సి ఇం స్పెక్టర్కు సొల్లిడుస్తాను.

భీమ: _ అది అన్యాయము, మిక్కిలి అన్యాయము, ఆచార్యుల వారూ! ఎంతపని చేసి పెట్టితిరండి!! నా కెంత యపకీర్తి తెచ్చి పె ట్టితిరండీ!

మధుర:- సామీ! అయ్యర్ ను తిట్టవద్దండి. అయ్యర్ నిండా బుద్ది, వీరుదా క్రిమినల్ డిపార్టుమెంట్ లో వుండాలె. అప్పుడు దా డిటెక్షణ సూడండి! జిలిజిలియని యుండును. ....

భీమ: – (మధుర పిళ్ళెను కొంచెము పక్కకు తీసికొనిపోయి) హెడ్ కాని స్టేబిల్ గారూ! ఏదో ప్రమాదము జరిగినది. చెప్పు కూడని సంగతి మా ఆచార్యులు చెప్పి వేసిరి. అయితే రెండు విష యములు మాత్రము మీరు నాకు సహాయము చేయవల యును. ఇన్ ఫర్ మేషశ్ నానుంచి వచ్చిందని మీడై రీలో ఎ క్కించకండి. రెండవది ఇది తప్పక చేయవ లెనుసుమండి-ఇక రెండు ఘంటలు మాత్రము శ్రీధరుని ఇంటికి ఝడ్తి చేయుటకు పోవద్దండి.

మధుర:- ఎందుకు? మాల్ పరారి అయితే......

భీమ: _ శ్రీధరుని ముసలితల్లి తెల్ల వారుజామన మరణము చెందినది. ఇప్పుడే శవమును సాగించు ప్రయత్నము లోనుండును. పాపము. దుఃఖసమయము, ఇంచుక నిదానించి శవసంస్కార కార్యములు ముగిసిన పిదప మీపని చేయుడు. అంతవరకు మాలుపరారిచేయ కుండ నేను జవాబుదారి, కాపు దారి. ఏదోకష్టకాలము, నాకు ఎంత మోసము చేసియుండినను కష్టకాలములో ఏదైనను ఆయ నకు సహాయము చేయవలయునని అచ్చటికి పోవుచుంటిని. ఇం, తలో నాకు స్టేషన్ కురమ్మని పిలిచితిరి.

మధురః - సార్ , మీరు స్టేషన్ కు వచ్చే పనిఏముంది? ఇప్పుడు కేసు దా తెలసిపోయిడ్సిందే! నేను ఇన్ స్పెక్టరుకుపోయి సెప్పిడుస్తాన్.

56