పుట:Saripadani Sangatulu by Bellary Raghava.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సరిపడని సంగతులు

రెండవయంకము - నాల్గవ రంగము.

స్థలము-వీధి.

కాలము-ఉదయము సుమారు 8ఘంటలు, లోనుండి

“దారిద్ర్యడుభేనకరోతిపాపం”

అనిభీమసేనరావుధ్వని వినబడును.

(భీమసేనరావు, ఆచార్యులవారు ప్రవేశింతురు.)

Head-Constable, మదురపిళ్ళెవచ్చి- మధుర:-ఎంతపనియుండిన సమాళీంచుకొని స్టేషన్ కు జరూరుగా పిల్చుకొని రమ్మన్నారు. ఇంస్పెక్టరుగారు.

వకీలు:-అవునయ్యా! వీరణ్ణశెట్టి నాకక్షిదారుడే. వారింటిలో చోరీ అయినది నాకు ఆశ్చర్యముగా నున్నది. కాని, శెట్టిగారి కుమారునకు చంద్రహారము చోరీకి సంబంధమేమయ్యా? ఈక్రొత్తసిష్టం ఇంస్పెక్టర్లదంతా (అని దగ్గి) ఒకమోస్తరు, కన్నమొకచోట. వీర్ల పరీక్ష మరియొక్కఛోట.

మధుర:-నాకుతెలవదుస్వామి! వెళిగాలమే లేచి చెట్టిగారు మన ఇంటికాడ చ్చింది. ఇంస్పెక్టరుగారు మిమ్ములను అడుగాలెయని.....

వకీలు:-ఎవరుచెప్పినది? సర్వాబద్దము. నేను అప్పుడే చెప్పితినే దొంగ ఒక్కచోట మీరు వెదికేది ఒక్కచోట అని.

మధుర:-మాది ఏముండాదిస్వామి? నాకాలమంత అయి పోయిండాది. ఇంకొక్క వత్సరం అయిపోయిండాదంటె పించిన్ వస్తాది.

విద్యా:- పిళ్ళెగారు ఏమాత్రం గంటుకట్టిండారో ?

మధుర;- ఎక్కడుండాది స్వామి ఈకాలం లో ? ఇప్పుడుండే పెద్దోళ్ళకే సాలెల్లేదు; నాకెక్కడస్వామి. దొర్లుకూడ అట్లా టివారే వస్తారు. మాకు పెరియ కేసులే లేవు స్వామి.

వకీలు:- ఇదిపెద్దకేసుకాదా? రాజా వీరణ్ణశెట్టీగారి ఖజానాపెట్టె నుంచి చంద్రహారము పోవడమంటే ఏమి? వేసినబీగం వేసినట్టే యున్నదికదూ?

54