పుట:Saripadani Sangatulu by Bellary Raghava.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ అంకము

{ విద్యా:-నారాయణ! నారాయణ!! మగువలు మతాచార్యుల వారి మాటలు పాటింపకపోయిన, మా భరత ఖండపు గతియేమి గావలయును?

భీమ:-ఆచార్యులవారూ! నాబుద్ది చెడిపోయినది. కుల నాశనమగు కాలము సమీపించినది. అయ్యో! ఎట్టి ఇంటితనము! ఎట్టిఅభిజాత్యము! ఎట్టివంశము! ఎట్టి శీలము నాకుమారుడి విధవను పెండ్లిచేసి కొనుటకు ముందు నాకు చావురాకున్నదే!

విద్యా:-(మఱల పొడుమువేసి) రావుజీ! దు:ఖపడకండి. 'ధైర్యం సర్వత్ర సాధనం ' అన్నారు. నేనంతయు చక్కబెట్టెదను. నాకొక్కయుక్తి తోచుచున్నది. ఒక చిన్న బొంకుబొంకిన చాలును. ఇది యెంతటిపని. శ్రీధరుడే లేకుండిన తారేక్కడిది? అప్పుడు వివాహమెక్కడ జరుగును? శ్రీధరుడే బహిస్కృతుడైన ......? ఇచ్చటినుండి వానిని తొలగింప వలయును.

భీమ;-నాకేమోదిగులుగ నున్నది. మీరెట్లీకార్యము సమకూర్చిదరు?

విద్యా:-తొందరపడకండి. కొంచెము కల్పనాశక్తి.... ... కించిత్తు అబద్దము...; ఏమిచేయవలెను? ఈగతి , ఇట్టిచిక్కు, ధర్మరాజుకే కలిగెను. విన్నారాలేదా! "అశ్వద్ధామా హత:....." అదియుగాక-

    "వారిజాక్షములందు, వైవాహికములందు
     ప్రాణ విస్తమాన భంగమందు.
     జకిరిగోకులాగ్ర జన్మరక్షణమందు
     బొంకవచ్చు నఘముబొందడధిప!"

ఇది మహాభారతమయ్యా! పంచమవేదము. వ్యాసుల వారిది. ఇది ఇట్లుండనిండు. వీరణ్ణశెట్టిగారింట చంద్రహారము చోరీవిషయము విన్నారా లేదా?

భీమ:- వింటిని

విద్యా:-పోలీసువారు శెట్టిగారి నౌకర్లయిండ్లను, గుమాస్తాల ఇండ్లను సోదాచేయవలెనని యున్నారట.

52