పుట:Saripadani Sangatulu by Bellary Raghava.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ యంకము


భీమ:- అయ్యో! నీవెట్టి అజ్ఞానురాలవు. ఆచార్యులవారు బోధించు భగవద్గీతను నీకు వినుటకు అధికారము లేదు గాని వినియుండిన నీవుగ్రహించు చుంటివి. మానవుడు మాధవుని చేతిబొమ్మ. ఆయన యెట్లాడించునో అట్లే ఆడుచుండవలయును గాని కర్తృత్వము మాకెన్నటికైనను గలదా? కర్తృత్వము లేనప్పుడు మమ్ము పాపమెట్లు బాధించును.

లీల:-అయినమగువలకు మాత్రము కర్తృత్వముగలదో? వారు చేయు కార్యములు గూడ దైవ ప్రేరితములే. వారిని మాత్రము పాపమెట్లు బాధించును?

భీమ:- (తలగోకుకొనుచు) అధిక ప్రసంగిని, అచార్యుల వారు దీనికి తగిన సమాధానము చెప్పుదురు. నాకు కొంచెము కాఫీతీసుకొని రమ్ము.

లీల:- నేడేల ఇంతకీశీఘ్రముగ వచ్చితిరి?

భీమ:- వచ్చినదే మంచిదాయెను. లీలా! నీవు శ్రీధరుని ఇచ్చటికి రానివ్వకుము. జనులు నన్నేమను కొందురు. తారకు లోలోపల నేను సహాయముచేయు చున్నానని శంకింపరా?

లీల:-.....చూడండి. ఇదివర కెన్నడును మిమ్ములను ఏవిషయమందైనను ప్రార్ధింపలేదు. భూషణముల నడుగ నైతిని. నాకొఱకై ఏమియు నడుగను. మీకు సలహాచెప్పుటకు నేనుశక్తురాలను గాను. అయిన ఒక్కటి మాత్రము నేనుచెప్పవ లయునని ధైర్యము చేసితిని. క్షమింపుడు. తారను రక్షింపవలసిన భారము మీది.

భీమ:-లీలా! లీలా!! నీకేమి పిచ్చిపట్టినదా? మతిపోయినదా?

లీల:-మతి గలిగియే మాటలాడు చున్నాను. మీకు అంతయు తెలియును. (ధైర్యముతో) తారను నిక్కముగ మీకోడలనియే భావింప వలయును. భావించి వివాహముచేసియే తీరవలయును.

భీమ:-ఏమీ......?

50