పుట:Saripadani Sangatulu by Bellary Raghava.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ రంగము.


తార:- వీనివిషయమై శాస్త్రమేదైనగలదా?

శ్రీధర:- తారా! నా కేమి తెలియును?

తార - అట్లుగాదు. నాకు తెలసి కొనవలయునను కుతూహలము? మీకిదివరకు పెండ్లి కా లేదే, ఇప్పుడ పెండ్లి చేసికొనగూడదా. (మిక్కిలి మన వేదననభియించును. అప్పుడులోనుండి శ్రీధరునితల్లి, నాయనా, భోజనము ముగించి మరల మాటాడరా దాని అనిపిలుచును వెంటనే తార లోనికి చనుము )

శ్రీధర: – అమ్మా! ఇ దేవచ్చితి. అంగడికిపోయి శీఘ్రముగా వచ్చెద. (అని వెడలిపోవును)


సరిపడని సంగతులు

రెండవ అంకము- రెండవరంగము

(చేతిలో నోటీసును పట్టుకొని ప్రవేశించుచు)

శ్రీధర:- నేనేమి చేయుదును? దైవము నన్నేల ఇట్లు తీక్ష్ణముగా బాధించుచున్నాడు? (నోటీసును చూచి)

“సంఘసంస్కరణోపన్యాసము"

వకీలు, భీమ సేన రావుగారధ్యక్షత వహింతురు.

ఏలకో ఉపన్యాసములు? ఉపన్యసించువారు వారి వారి ఆడంబరము గొరకు. వినువారు కాలహరణముకొరకు. ఈ దేశములోని వాతావరణ మంతయు ఉపన్యాసములచే జనించిన వేడిమి వలన నే ఎండిపోయి, వర్షములు రాకున్నది. విద్యార్థులకు గూడ ధైర్యము చాలక యున్నదే. రాజారావు కేల సాహసము కలుగ కూడదు? అధర్మమును బోధించు, తండ్రికి వెఱచి, ఋజు మార్గమును, న్యాయ మార్గమును తొలగి పోవుటయా? ఓహూ! తలచుకొని నంతనే ఇచ్చటికే వచ్చు చున్నాడు.