పుట:Saripadani Sangatulu by Bellary Raghava.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ యంకము


శ్రీధర:- తారా! నీవు చెప్పునది నిజమేగాని సాధ్య గాదు. . . . కాదు. కాదు. ప్రేమ మహిమ నేనేమని చెప్పుదును? (పేమ స్థిరమైన, దృఢమై పదార్థము. అట్టి ప్రేమకు, చాంచల్య ప్రధానమైన మన సు జన్మస్థాన మెట్లగు? అనగా మన శ్చాంచల్యము అంతరించువ రకు ప్రేమబీజము నాటుటయే కష్టమేమో......!

తార:- మీరేమాటాడు కొనుచున్నారే! నాకర్థనుగునట్లు చెప్ప రాదా?

శ్రీధర:- తారా! ప్రేమయిట్టిదియని చెప్పుటకు సాధ్యముగాదు. అయిన ఇట్టిది కాదని చెప్ప నలవియగునేమో!

తార:- ఇట్టిది కాదనగా ఎట్టిది కాదు?

శ్రీధర:- తారా! ప్రేమము కామము కాదు. మోహముగాదు. స్వాగముగాదు. వశీకరణముగాదు. వంచనగాదు. మంత్రము గాదు. తంత్రముగాదు. ఆకర్షణ యంత్రముగాదు. నశించునది గాదు. చిక్కిపోదు. చిన్న పోదు. వాడునది గాదు. కష్టములు వచ్చెనని వీడిపోదు. చీకటిని వెన్నెలగా చేయును. పేదను పెద్ద నుగా చేయును. ఇహమందే పరమును ప్రత్యక్షము చేయును. భూషణముల నడుగదు. అలంకారములన పేక్షింపదు. ఒక్కరికి చిక్కదు. అయిన సర్వప్రపంచమును చిక్కించుకొని తరింప చేయుటకై వేచియుండును......

తార: _కొంచెము తెలిసినట్లాయెను. అబ్బా! ఎంత పెద్ద విషయము. అయిన మరలనడి గెదను. ఇట్టి ప్రేమశక్తి కి నశ్వర మైన ఈ దేహ మునగడచిపోవు వయసు అభ్యంతరమగునా? అయ్యా! ముసలి తనమనగా నేమి? ముసలివాడనగ నేమి?

శ్రీధర:-.............

తార:- ముసలితన మెప్పుడు ప్రారంభ మగును?

శ్రీధర:..............

తార: పోనిమ్ము. యావన మెప్పుడు ముగిసిపోవును?

శ్రీధర: - ..............

38