పుట:Saripadani Sangatulu by Bellary Raghava.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొదటి గంగము

.

శ్రీధర:- ఆ! (నవ్వి) సాధ్యముగాదది. పోనిమ్ము. నీకు సారంగధర నాటకము జదువుటకు ఏల కుతూహలమ గలిగినది?

తార:- ఎచ్చట చూచిసను ఈనాటక ప్రశంసయే. ఆంధ్రనాటక పితామహులు ఏదోనూతన ఫక్కి ననుసరించి ఈనాటకమును వాసియున్నారట. ఎట్టియోగ్యమగు నాటకమో చూడవలెననియాశ.

శ్రీధర:- తారా! ప్రపంచమున 'యోగ్యమగు కథకంటెను అను కూలత కలగించు కథయందే ప్రీతి హెచ్చు. ఈనాటక మువలన కలుగు అనుకూలత లెవ్వి?

శ్రీధర:- చెప్పెదను వినుము. ముసలి వాడు పడుచుపిల్లను పెండ్లి చేసికొనవచ్చును. పెండ్లికొడుకు కాటికి కాలు జాచినను పెండ్లి కుమార్తె కూటికి చేయి చాచున దై' యుండవచ్చు. కన్య అప్పుడే కండ్లు తెఱచుటకు యత్నించునదై యుండవచ్చు. వరుడు ఎన్న డో కండ్లుమూసికొనుటకు సిద్ధుడైయుండ నోపు. కన్యకు పాలపండ్లు వీడక పోయినను తప్పు లేదు. వరునికి పక్క పండ్లు సైతము రాలి యున్నను 'బాధకము లేదు.

పౌరుప.హీనమైన కామమును పూరించికొనుటకై , న్యాయమున కై- కాదుకాదు-కోర్టున్యాయమునకై అంగభంగము చేయింపవచ్చు ను. మగవాడు చేసినదోషమునకు మగువను దూషించుటయే సతీపతుల ధర్మమని భావింపవలెను. .

తార:- అట్లనా! ఈనాటకమున అసమవివాహము వలన కలుగు అనర్ధములు మగవారిపశమున ప్రశంసింపబడిన వా? అదియ ట్లుండనిమ్ము. అయ్యా! నిన్నొక్క ప్రశ్నయడి గెదను. నిజమైన పరస్పర ప్రేమ కలిగియుండిన వయసు నందలి తారతమ్యము లెక్కకువచ్చునా?

శ్రీధర:- ఏమంటివి? వలదు. వలదు. గ్రహించితి. ఎందుకనగా మనసు . . . . . . పరస్పరము . . . . . . వయసు. .

తార:- ఏమికలత చెందుచున్నారు?

37