పుట:Saripadani Sangatulu by Bellary Raghava.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొదటి యంకము


నిన్ను గూడ వేధించుచున్నవా? రామచంద్రా! నాయందుండు శిశువు నీకుకూడ భారమా? శ్రీరామచంద్ర! రామా! నా యాశయంతయు, నాభారమంతయు నీ పైన పెట్టుకొని యున్నాను. నిక్కముగ నీవేకదా నాప్రియుడు. లోకమున కే ప్రియుడైన వాడు నాకు ప్రియుడు గాకూడదా? ప్రియా! నీవిచ్చిన పాణ ముల నీకే సమర్పింతును. రామచంద్రా! నే వట్టి భ్రాంతను, నీ కెన్నటి కైనను స్త్రీలపైన దయ గలుగునా? కలుగదు! నిను మోహించిన శూర్పణఖను నిష్కా రణముగ ముక్కు గోయించితివి. వలదనిన పోవుచుండెనే! ము క్కు గోయింప వలయునా? నీవే పర దైవమని నమ్మి, కలయం దై నను కళంకముకానని జానకిని అడవులకు బంపి అగ్ని ప్రవేశము చేయించితివి. హా! నాకుదిక్కు నీవుగావు! ఇదిగో ఈ బావియే. ఈ దౌర్భాగ్యపు దేశమునందు నాయట్టి నిరాధారలగు వితంతు స్త్రీలకు జలములే ఆధారములు. అమ్మా! అనాథ బంధూ ! అమృ తసింధూ ! (అని ప్రార్థన చేయుచుండును. శ్రీధరుడు ప్రక్క నుండి తటాలునవచ్చి)

శ్రీధరు. _ బిడ్డా! తారా! ఆపని చేయకుము. నీవు చేయగూడదిట్టి పని. దుఃఖమెన్నటికిని అవార్యముగాదు. తారా! నీ సేవ చేయు టకు సిద్ధముగా నున్నాను. తారా! ఎందులకిట్లు సాహసించితివి?

తార:- శ్రీధరా! పౌరుషధర్మమే నాశనమైనది.

శ్రీధరు:-నీ వాడినది సత్యము. నీ సమాచారమును నేనాక స్మికము గ గుర్తెఱింగితిని. ఆనాడే నిన్ను బాధలనుండి తప్పించి, నీకు ధైర్యము నొసగ వలసియుండె. మన కృత సమాజము యొక్క నిర్వీర్యత్వమునకు ఇంచుక చిక్కియుంటిని. ఇప్పుడు ధైర్యము చేసితిని. నిజముగ పురుషుడ నై తిని. తల్లీ! రమ్ము నాయింటికి. నన్ను గన్న తల్లి నీకు సర్వసౌఖ్యములనిచ్చి నీమనసునకు శాంత త కలుగ జేయును. సంతోషమున నిన్ను పోషించును. ఆమెకు వయస్సయినది. ముసలిది. నేడో, రేపో, హరిచరణముల చేర

30