పుట:Saripadani Sangatulu by Bellary Raghava.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొదటి యంకము


రాజు:- తారా! తారా!! వలదు, వలదు, నీవట్లు చేసిన, . నే నెం దై నను పోయి నాప్రాణముల బాసెద. అబ్బ బ్బా! నా చేత కాదు.

తార:- రాజా! దైవమా! నీవే నాగుదిక్కు. (అని వెడలిపోవును)

రాజ:-(కొంచెము సేపు ఊరకుండి, పిదప “My God" !! అని లోనికిపోవును , అదివరకు దూమునుండి వినుచుండిన శ్రీ దరుడు ముందరికి వచ్చి స్వగతము గా,)

శ్రీధ:-ఇప్పుడంతయు తెలిసెను. దుర్బలమగు ఈనాటి హైందవ సంఘ ధర్మము చే మోసగింపబడి సంకటముకు గుఱియైన నిరపరాధి యగు ఈపడుచు భ్రష్ట' యని పించుకొనును. మోసము చేసి మీసముల దువ్వుచుండు హీనుడు శిష్టుడనిపించు కొనును. ఎట్టి దుష్కార్యములు చేసినను, ఎట్టి అకృత్యము లొనరించినను ఇప్ప టి సమాజమున మగ వాడు మాననీయుడే. ఓరీ దుర్బలహృ దయా! సౌఖ్యము ననుభవించితివి. సౌఖ్య బీజము నిందునాటి తివి, దాని ఫలము మాత్రము నీకు విషమా యేగదా? నీవద్దనుం చుకొని సంరక్షించుటమాని ఆమెను హింసించుటయా! (తార నుగురించి తనలో) బిడ్డా! దుఃఖం పకుము. నేను సిద్ధుడుగా నున్నాను నీ సేవ జేయుటకు- పేద నగుగాక , కడుబీదనగుగాక , నిన్నాదరించు టకు- నేను సిద్ధుడ. దీనివలన నా కెట్టకష్టములు గలిగినను కలుగ నిమ్ము. తుదకు మరణము గలిగినను కలుగ నిమ్ము.

నిన్నాదరించితినా, నానౌకరీకథ ముగిసిపోవుట నిశ్చయము. భీమ సేన రావుగారు ఖండితముగా సన్ను గెంటి వేయుదురు! ఇంటిలో మహాలక్ష్మి పెద్దక్క తాండవ మాడుట తప్ప వేరు వైభవము లేదు. తల్లి వృద్ధురాలు.

శ్రీధరా! శ్రీధరా!! నీ కెట్టి జ్ఞానము? జేనెడు పొట్టకై , సర్వప్రపం చమును సర్వకాలముల యందు వ్యాపించి యుండు దైవానుగ్ర హము నే మరచితివా? కవి చెప్ప లేదా? 'ప్రతి గింజ పైననూ ఏదియేది ఎవ రెవరికి జేరవ లెనో వారివారి పేరు వాటిపై ముం దే వాయబడి యున్నదని'. పుట్టించిన దేవుడు నిన్ను సంరక్షింపక పోవునా? ధైర్యమొక్కటి కావ లెనుగాక.!

22