పుట:Saripadani Sangatulu by Bellary Raghava.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొదటి యంకము


రాజ:- (ఇటునటు చూచి, శ్రీధరుని కానక , తారను సమీపించి)

తారా! నన్నడగ వలెనా? నీకొరకై నాప్రాణముల నర్పించుట కైనను సంసిద్ధుడనై యన్నానే!

తార:- రాజా! నీవు నన్ను పెండ్లియాడుటకు సిద్దుడ వై యుంటి విగదా!

రాజ:— ఏమి ఇప్పుడే పెండ్లియాడ వలయున నెదవా?. .. అవశ్య చేసి కొందును, విధవా వివాహము సంస్క రణమునకు మొదటి మెట్టు. అదియుగాక నీవు విధవ యేకాదని నాయభిప్రా యము. తొలుతనుండి మనము ఒకరికొకరు ప్రేమించియుం టిమి. హృదయ పూర్వకమైన ప్రేమతో మగ డేర్పడను గాని మంత్రములతో మగడు కాగలడా? ఇప్పుడు వివాహమున కేమి తొందర? నేను ఈతూరి ఖండితముగా B. A., పరీక్ష యందు కృతార్థత నొందుదును. పిదప తప్పక నాకు సర్కారు నెకరీ అబ్బును. నౌకరీలో చేరిన వెంటనే నిన్ను పెండ్లి చేసి కొందును. అప్పుడు తండ్రి భయము లేదు, గిండ్రి భయము లేదు.

తార:- రాజా! నేను గర్భిణిని. (నిర్విజ్ఞుడై దూరముగా నిలుచును.)

తార:-- రాజా! భయపడకుము. నాచేయి విడువ వలదు.

రాజ:- నిజమా?

తార:- అవును.

రాజు:— ఎంత ప్రమాదము గలిగెను! దీని కుపాయ మెద్దీ?

తార.- ఇది ప్రమాద మనుకుంటివా?

రాజు:— తారా! కనలుకుము. ఇట్టిది సంభవించుట ప్రస్తుతము అననుకూలమే కదా!

తార:- మీతండ్రికి తెలిసినది.

రాజ:- ఏమ నెను?

తార:- చెప్పరానిమాట చెప్పెను.

20