పుట:Saripadani Sangatulu by Bellary Raghava.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ రంగము.


ప్రేమించి దేశోద్ధారక కార్యములలో వారిని సహాచరులుగ భావించు మగవాడే నిజమైన మగవాడు. ఆడుదానిని నొప్పించి బాధించు మగవాడు దేశమునకు, దైవమునకును పగవాడే? రఘు:- Ladies & Gentlemen, Three Cheers for the mighty Speach.

ఔరా! రాజా!! Women's Champion నీవే!!! అనాధరక్షకు డవునీవే!!!! ఆహాహాహా! స్త్రీల పాలిటి చింతామణి ప్రాయుడవు నీ వేనయ్యా!

భాస్క:- రఘునాథా! ఇది నీతప్పుగాదు. ఇప్పటి సమాజపు తప్పు. మన సమాజమను నిర్బంధమున పెట్టి ముందు సంకెలలు, మన ము మన స్త్రీలకు తొడగిన ఆసం కెలలే......

రఘు:- భాస్కరా! ఇంక చాలు నీయుపన్యాసము. మాయింట మంగళ హారతికి వేళ అయినది, పోవుదము.

(రాజ యింటిలోనికి పోవు చుండగా, తార లోనుండి వచ్చును. భాస్కరుడు, రఘు నాధుడు వెడలిపోవుదురు. శ్రీధరుడు మరగున నిలుచును)

తార:- రాజా! ఒక్కమాట. రాజ; — ఏమి యిట్లువచ్చితివి!?

తార:- రాజా! ఒక ప్రమాదము సంభవించినది. "స్త్రీలకు ఎట్టి విపత్తులు వచ్చినను సహాయము చేయవలసినది పురుషుల ధర్మ"మని నీవు ఎల్లప్పుడు ఉపన్యాసములిచ్చు చుంటివిగదా! నీ పరీక్ష సమీపమునకువచ్చినది.

రాజ:-అవును చెప్పుచుంటిని. ఆడుదానిని నొప్పించు మగవాడు మగవాడే కాడని ఇప్పుడుకూడ చెప్పితిని. అయిన నీమాటలు నాకు అర్థముగా లేదు. నాపరీక్ష సమయమేమి?

తార:- రాజా!...... నాయందు నీకు నిజమైన ప్రీకి యున్నది గదా?


19.