పుట:Saripadani Sangatulu by Bellary Raghava.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొదటి యంకము.


రఘు:-- ఓ! అర్థమైనది, నీవు అవి వేకివని. నీవు ఎంత చెప్పినను స్త్రీ జాతి తక్కువయనియే నాయభిప్రాయము. తక్కువ కనుకనే ఏ రహస్యము వారిదగ్గర దక్కదు. ఇరువుకు స్త్రీలు కలిసిన కొట్లా టతప్పక ప్రారంభమగును. ఏడ్పు తప్ప వానికి వేరుతర్క వాదమే తెలియదు. కాలమంతయు సొగసు చేసికొనుటయందే గడుపు దురు, అదిగాక మన మఠములలో దేనియందైనను స్త్రీలు స్వాముల వారైనది చూచియున్నావా?

భాస్క: రఘునాథా! ఎంతటి మూర్ఖుడవు నీవు? ఈ దేశమునకు ప్రస్తుతము గలిగియుండు దైన్య దశకు ఇచ్చట స్త్రీలను ఆవరిం చియుండు అజ్ఞానమే కారణమని నీమనసునకు తోచదే! ఇంటి యందు గృహిణి దుఃఖించి రోదించు చున్నదన్న , నాయిఁట శుభ ముగలుగునా? ఇట్లుండ దేశములోని స్త్రీలందరు దుర్బలులై పరతంత్ర లై , అజ్ఞాను లై , సంస్కృతి లేక శుష్కించుచుండగ దేశ మునకు వైభవ మెట్లుండును? స్త్రీలకు విద్య లేకున్న . .

రాజ:-(అడ్డుపడి) భాస్కరా! మన దేశమునకు వచ్చినందుకు మన దేశమున జరుగుచుండు వివాహముల నుండియే, మనవివాహ ము' కు తలిదండ్రుల భీతి, నిర్బంధము కారణము కాని, దంపతుల ప్రీతికి అందుచోటే లేదు. అట్టివి విహముల నుంచి సరియైన సంతా నమెట్లు గలుగును? విద్య లేని, స్వేచ్ఛ లేని, బలము లేని, సరియైన ఆధర్శము లేని, తల్లికి ధైర్యశాలియగు పుత్రు రెట్లు గలుగును? పూర్వము మన క్షత్రియ వీరులు తమస్త్రీ సమూహములను రక్షించుటకు గదా ప్రాణముల యందు ఆశవీడి రణరంగమున పోరాడు చుండిరి! మనమన్ననో ఇప్పటి సమాజములో స్త్రీ మా నము కాపాకుట పోనిమ్ము, వారికి , అవమానము కలిగింపకున్న చాలును. క్లబ్బుస 'గతి తెలుసునుగదా! కొంచెము అవకాశము గలిగి, నలగురు మెంబర్లు ఒక్క చోట చేరినచో, సంభాషణ పర స్త్రీలను గురించియే! ఈ స్త్రీ ఇట్లు, ఆ స్త్రీ అట్లు -ఇంత తప్ప వేరె సంగతుల సంభాషణయే లేదు. ఆడవాండ్రు ఎట్టివారేకాని, వారి యందు ' ఎట్టిలోపము గలిగి యుండినను, వారిని గౌరవించి

18